వాంతులు, విరోచనాలతో ఇద్దరు వ్యక్తులు మృతిపై మంత్రి నారాయణ సమీక్ష

Oct 24, 2024 - 15:52
Oct 24, 2024 - 15:54
 0  63
వాంతులు,  విరోచనాలతో ఇద్దరు వ్యక్తులు  మృతిపై  మంత్రి నారాయణ సమీక్ష

అమ‌రావ‌తి జనసాక్షి  :

ప‌ల్నాడు జిల్లా దాచేప‌ల్లిలోని అంజనాపురం కాల‌నీలో వాంతులు,విరేచ‌నాల‌తో ఇద్ద‌రు వ్య‌క్తుల మృతిపై మంత్రి పొంగూరు నారాయ‌ణ స‌మీక్ష‌.

జిల్లా అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన మంత్రి నారాయ‌ణ‌.

జిల్లా కలెక్ట‌ర్ అరుణ్ బాబు,జేసీ సూర‌జ్,ఆర్డీఎంఏ హ‌రికృష్ణ‌,డీఎంహెచ్ వో ర‌వికుమార్,ప‌బ్లిక్ హెల్త్ ఎస్ ఈ శ్రీనివాస్ ,న‌గ‌ర పంచాయ‌తీ క‌మిష‌న‌ర్ అప్పారావులతో స‌మీక్ష‌.

నీరు క‌లుషితం కావ‌డం వ‌ల్ల చ‌నిపోయారా లేక వేరే కార‌ణాలున్నాయా అనే దానిపై ఇంకా రాని స్ప‌ష్ట‌త‌.

స్థానికంగా ఉన్న బోర్ల‌లో నీటిని విజ‌య‌వాడ ల్యాబ్ కు ప‌రీక్ష‌ల‌కు పంపాల‌ని మంత్రి నారాయ‌ణ ఆదేశాలు.

బోర్ల‌ను అన్నింటిని మూసివేసి వాట‌ర్ ట్యాంక‌ర్ల ద్వారా తాగునీరు స‌ర‌ఫ‌రా చేయాల‌ని సూచించిన మంత్రి.

ఇద్ద‌రు మృతి చెంద‌డంతో పాటు మ‌రో ఆరుగురు ప్ర‌యివేట్ ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని తెలిపిన క‌లెక్ట‌ర్.హెల్త్ క్యాంపులు ఏర్పాటుచేయ‌డంతో పాటు పారిశుద్య పనులు ముమ్మ‌రం చేసిన‌ట్లు వెల్ల‌డి.

డ్రెయిన్ ల‌తో పూడిక యుద్ద ప్రాతిప‌దికన తొల‌గించ‌డంతో పాటు మంచి నీటి బోర్ల‌ను అన్నింటిని త‌నిఖీ చేయాల‌ని మంత్రి నారాయ‌ణ ఆదేశాలు.

అవ‌స‌ర‌మైతే ఇత‌ర మున్సిపాల్టీల నుంచి సిబ్బందిని ర‌ప్పించాల‌న్న మంత్రి.

సాధార‌ణ ప‌రిస్ధితి వ‌చ్చే వ‌ర‌కూ మున్సిప‌ల్,వైద్యారోగ్య శాఖ అధికారులు ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల‌ని ఆదేశాలు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow