కిషోర్ హృదయ భాష పాలపిట్ట దీర్ఘ కావ్యం

-కిషోర్ హృదయ భాష పాలపిట్ట దీర్ఘ కావ్యం...
ప్రముఖ కవి, సాహిత్య విశ్లేషకులు *బీరం సుందరరావు
-పాలపిట్ట దీర్ఘ కావ్యం సమకాలీన సామాజిక రాజకీయ సాంస్కృతిక వైవిధ్యం చాటుతోంది
-ఛైర్మన్ రాష్ట్ర మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ *కొమ్మూరి కనకారావు
-సమాజకవి ముప్పవరపు కిషోర్...* నాగార్జున యూనివర్సిటీ సైన్స్ లైబ్రేరియన్ *కొండలరావు*
-దీర్ఘ కావ్యం రాసిన కందుకూరు ప్రాంతంలో మొట్టమొదటి కవి ముప్పవరపు కిషోర్*
-కళ్యాణి భారతి సాహిత్య సంస్థ అధ్యక్షుడు యు.వి.శేషయ్య
జనసాక్షి :పాలపిట్ట లో కవి కిషోర్ హృదయ భాష వినిపిస్తోంది.అని ప్రముఖ కవి, సాహిత్య విశ్లేషకులు బీరం సుందరరావు అన్నారు పాలపిట్ట దీర్ఘ కావ్యం సమీక్ష చేస్తూ సమాజంలో సామాజిక ఆర్థిక రాజకీయ అనేకమైన విషయాలు ఈకావ్యంలో ప్రస్తావించారు. అస్తవ్యస్త సమాజం బాగుచేసే పని ఈకావ్యంలో చేస్తారు కవి కిషోర్. పేదలు,అన్నార్తులు, అనాధలు, అభాగ్యులను కావ్యం లో వస్తువులు గా తీసుకుని వారి జీవితాలను వర్ణించటం జరిగింది. కవి కిషోర్ తన స్వీయ అనుభవాన్నీ, లోకానుభవాన్నీ రంగరించి ఈ పాలపిట్ట కావ్యం రాశాడు.కవికీ నిర్భయమైన గళం వుండాలి, నిర్భితీ వుండాలి, చెప్పదలచుకున్న దానిని ధైర్యంగా చెప్పాలి ఆ పని పాలపిట్ట దీర్ఘ కావ్యం లో చేశారు కవి కిషోర్. సామాజిక ఇతివృత్తంగా దీర్ఘ కావ్యాలు రావాలనేది ప్రముఖ కవి నాగభైరవ కోటేశ్వరరావు కల, ఆ కల ఇన్నాళ్లకు కిషోర్ పాలపిట్ట దీర్ఘ కావ్యం ద్వారా నెరవేరింది. నాగభైరవ బ్రతికుంటే హృదయానికి హత్తుకునేవారు. హృదయంతో చదివితే గాని పాలపిట్ట కావ్యం అర్థం కాలేదు నాకు . కావ్యం చదువుతుంటే కొన్ని చోట్ల కన్నీళ్ళు వచ్చాయి. మీరు కూడా మనస్సు తో చదవండి, హృదయంతో చదవండి అప్పుడే పాలపిట్ట కావ్యం అర్థం అవుతుంది. ఎంత సంపాదించినా కూటి కోసమే కడకు కాటి కోసమే అనే జీవన తత్వాన్ని ఒకప్పుడు వేమన చెప్పాడు, వీర బ్రహ్మం చెప్పాడు, యేసుక్రీస్తు చెప్పాడు ఇప్పుడు కిషోర్ కూడా అదే చెప్పుతున్నారు. కిషోర్ సామాజిక స్పృహ నింపిన దీర్ఘ కావ్యం రాసి చరిత్రలోఈ ప్రాంతం యొక్క మొట్టమొదటి కవిగా నిలిచిపోయారు.అనేక వర్ణనలు ఈకావ్యంలో వుంటాయి అని అన్నారు.పాలపిట్ట దీర్ఘ కావ్యం ఆవిష్కరణ సభ కందుకూరు పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు చేతులు మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం మార్పు కోసం అనేక విప్లవ, బహుజన ,సామాజిక ఉద్యమాలతో నిత్యం చైతన్యవంతంగా వుండే కిషోర్ పాలపిట్ట దీర్ఘ కావ్యం ద్వారా సాహిత్యకారుడిగా అవతరించాడు అంటే అతిశయోక్తి కాదు. పాలపిట్ట దీర్ఘ కావ్యం ద్వారా సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతూ సాగింది. అసమానతలు కలిగిన సమాజానికి కవి తన రచనలు ద్వారా సామాజిక చైతన్యం అందించడం జరుగుతుంది ఇది మహాకవి శ్రీశ్రీ, విశ్వనరుడు గుఱ్ఱం జాషువా నుంచి కిషోర్ వరకు అప్రతిహతంగా కొనసాగుతోంది. ఇంతటి అద్భుతమైన గొప్ప కావ్యం రాసిన కిషోర్ కు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా ఉన్నతమైన సాహిత్యం కిషోర్ కలం ద్వారా వెలువడాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈకార్యక్రమానికి కళ్యాణ భారతి సాహిత్య సంస్థ అధ్యక్షుడు యు.వి. శేషయ్య అధ్యక్షత వహించారు అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ కందుకూరు తాలూకా ప్రాంతంలో అనేక మంది కవులు, రచయితలు వున్నా దీర్ఘ కావ్యం రాసిన మొట్టమొదటి కవి ముప్పవరపు కిషోర్ ఆయన ఈ ప్రాంతం యొక్క చారిత్రక నేపథ్యంలో పాలపిట్ట కావ్యం వెలువరించి కవులకు ఆదర్శనీయుడు అయ్యారు అని అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సైన్స్ లైబ్రేరియన్ కొండలరావు మాట్లాడుతూ అంబేద్కర్ అన్నట్లు సింహాలు తమ చరిత్ర వ్రాసుకోకపోతే వేటగాడు చెప్పే పిట్ట కధలే ప్రాచూర్యం పొందుతాయి అన్నది అక్షర సత్యం అందుకే ఈ ప్రాంతం యొక్క విప్లవోద్యమం, సమాజం మార్పు కోసం కొట్లాడిన వైనాన్ని సాహిత్యంలో నిర్మొహమాటంగా వ్యక్తపరిచారు కవి ముప్పవరపు కిషోర్. అందుకే ఆయన సమాజ హితం కోరే సమాజకవి అయ్యారు అని అన్నారు. ఈకార్యక్రమం లో సాహిత్యాభిలాష దామా.వెంకటేశ్వర్లు, రేషనలిస్ట్ పి.వి. శేషారావు, సామాజిక వేత్త గేరాచిరంజీవి , కృష్ణ బలిజ కార్పోరేషన్ జిల్లా ప్రెసిడెంట్ పాశం కొండయ్య,అమ్మ వెల్ఫేర్ బి.వి రమణ, శ్రీ శ్రీ కళావేదిక జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరీభూషణం, కళ్యాణ భారతి సాహిత్య సంస్థ మాల్యాద్రి, శేషగిరిరావు, అన్నమయ్య సాహిత్య సంస్థ అధ్యక్షుడు ఇనకొల్లు మస్తానయ్య మంచుపొగ కవి ఉమ్మడి శెట్టి నాగేశ్వరరావు, మహిళా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పాలేటి సుచరిత, బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కళ్ళగుంట మోహన్ రావు,కె.వెంకటేశ్వర్లు,సంఘా మహేంద్ర, సామాజిక వేత్త పాలేటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో రచయిత కుటుంబానికి ఘన సన్మానం నిర్వహించారు. సాహిత్యాభిలాషి దామా వెంకటేశ్వర్లు, జానపద కళారూపాలు కిన్నెర బ్రహ్మాయ్య కు జాషువా సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి దుశ్శాలువను బహుకరించి సన్మాన పత్రం సమర్పించారు. ఈకార్యక్రమంలో జాషువా సాహిత్య సాంస్కృతిక సంస్థ సభ్యులు ముప్పవరపు రమేష్,మిడసల.మాధవరావు, ముప్పవరపు అశోక్, సూరపోగు అఖిల్, ముతకాని లక్ష్మి నారాయణ,యం.గౌతమ్, కామాక్షి,పి.వి.రమణయ్య, ప్రసన్న కుమారి, భోగిశెట్టి దత్తాత్రేయ, మల్లేశ్వరి దత్తాత్రేయ, రిజ్వాన్, షేక్ దస్తగిరి సరస కవి చంద్ర మార్తాటి ఈశ్వర గోపాల్, పంది నరశింహం, ముప్పవరపు శరత్ తదితరులు పాల్గొన్నారు ఉపాసకులు గాండ్లహరిప్రసాద్ సభాపరిచయం చేయగా జాషువా సాహిత్య సాంస్కృతిక సంస్థ కార్యదర్శి చనమాల కోటేశ్వరరావు వందన సమర్పణ చేశారు.ముందుగా జానపద కళారూపాలు కిన్నెర బ్రహ్మయ్య ప్రదర్శించారు, సభలో కళాకారులు పొనుగోటి ప్రభాకర్, బి.వెంకటేశ్వర్లు ఆలపించిన ప్రబోధ అభ్యుదయ గీతాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
What's Your Reaction?






