ఏపీ టిడ్కో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వేములపాటి అజయ్ కుమార్

Oct 23, 2024 - 16:53
Oct 23, 2024 - 17:04
 0  178
ఏపీ టిడ్కో    చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన  వేములపాటి అజయ్ కుమార్

జనసాక్షి :

ఆంధ్రప్రదేశ్ పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ టిడ్కో)

చైర్మన్ గా వేములపాటి అజయ్ కుమార్ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లోని టిడ్కో ఆఫీసులో బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పట్టణ, నగర ప్రాంతాల్లోని గూడులేని పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి కృషి చేస్తానన్నారు. నా మీద నమ్మకంతో నాకు చాలా ప్రతిష్టాత్మకమైన పదవిని ఇచ్చినందుకు నమ్మకంగా, బాధ్యతాయుతంగా పనిచేస్తానని అందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. అదేవిధంగా ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కశ్యాణ్ కి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి. నారాయణ లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. పట్టణాల్లో అర్హులైన పేదలందరికీ టిడ్కో ఇళ్లు అందిస్తామన్నారు. నా శక్తి వంచన లేకుండా పనిచేస్తానని అన్నారు. మా కుటుంబ సభ్యులే నాకు బలమని తెలిపారు. వేములపల్లి అనంతరామయ్య ప్రముఖ కమ్యునిస్టు లీడర్ గా, కార్పొరేటర్ గా, సంఘ సంస్కర్తగా మా ప్రాంతంలో పనిచేశారన్నారు. ఎంతో మంది పేదలకు ఆయన సేవలు అందించారన్నారు. ఆయన ఆశీస్సులే నన్ను ఇంతవాడిని చేశాయని ఆయన తెలియజేశారు.  

చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ను అభినందించిన అనంతరం పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం లో పదవులు పొందిన వారు స్ఫూర్తివంతంగా నిర్వహించాలన్నారు. ఆయన సేవలను ధృష్టిలో పెట్టుకుని అవకాశాలు వచ్చాయన్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఇళ్లు ఇవ్వకుండా చేసిన దుర్మార్గాలను చూశామని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన టిడ్కో ఇళ్లు కూడా అందించకుండా తుంగలో తొక్కరన్నారు. పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన వారిలో పార్లమెంటు సభ్యులు వేమిరెడి ప్రభాకర్ రెడ్డి, శాసనసభ్యులు లోకం నాగ మాధవి, శాసనమండలి సభ్యులు పి. హరిప్రసాద్, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow