నూతన విద్యుత్ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్

త్వరితగతిన సబ్ స్టేషన్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి... మంత్రి రవికుమార్.
ఈ సబ్ స్టేషన్ నిర్మాణం రైతులకు ఎంతో ఉపయోగం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.
చుట్టుపక్కల ప్రాంతాలలో లో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు.
ఉలవపాడు మండలంలోని మన్నేటికోట పంచాయతీలో సోమవారం నాడు 33/11 కె.వి. నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, త్వరితంగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సంవత్సరాలుగా రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలు తొలగించేందుకు శ్రమిస్తున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చొరవను ఆయన ప్రశంసించారు.
ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ సబ్ స్టేషన్ పూర్తయితే చుట్టుపక్కల గ్రామాలకు నిరవధిక విద్యుత్ సరఫరా లభిస్తుందని ఇది రైతులకు ఎంతగానో ఉపయోగమని పేర్కొన్నారు. ఇది కేవలం రైతులకు మాత్రమే కాకుండా, భవిష్యత్తులో పారిశ్రామిక అభివృద్ధికి కీలకమైన మౌలిక సదుపాయంగా మారుతుందని అన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గం లో 4 సబ్ స్టేషన్ కు అనుమతులు లభించాయని వాటిలో మొదటి విడతగా ఉలవపాడు మండలం మన్నేటికోట గ్రామంలో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, మిగిలిన 3 సబ్ స్టేషన్ లో కూడా త్వరలో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు..మన్నేటికోట ప్రాంతంలో ఎక్కువ రైతులు మామిడి, సపోటా తోటల పైనే ఆధారపడి జీవిస్తున్నారని వారికి గతంలో విద్యుత్ లో వోల్టేజ్ సమస్యతో బాధపడుతున్నారని, ఈ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయితే రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా అందించడం జరుగుతుందని తెలిపారు.ఈ సబ్ స్టేషన్ మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ కి ఇంటూరి నాగేశ్వరరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు..
What's Your Reaction?






