పోతిరెడ్డి పాలెం వద్ద కారు ప్రమాదంలో ఆరుగురు మృతి కలచి వేసింది - ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

పోతిరెడ్డిపాలెం వద్ద కారు ప్రమాదంలో ఆరుగురు మృతి కలచి వేసింది - ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం వద్ద కారు ఇంట్లోకి దూసుకెళ్లిన సంఘటనలో 6 గురు మృత్యువాత పడడం అత్యంత బాధాకరమన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు.
సుబ్బారెడ్డి పెట్రోల్ బంకు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నారాయణ మెడికల్ కాలేజీ విద్యార్థులు యగ్నేష్, జీవన్ నారాయణ, నరేష్, అభిసాయి, అభిషేక్ మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందన్నారు. కారు ఇంటిలోనికి దూసుకెళ్లిన సంఘటనలో ఇంటి యజమాని రమణయ్య మృతి చెందడం విషాదకరమన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం యిచ్చి గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు.
What's Your Reaction?






