కన్నులపండుగగా శ్రీ అయ్యప్ప స్వామి నగరోత్సవం

కందుకూరు : జనసాక్షి
కందుకూరు, శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో కార్తీకమాస వైభవ్త్సవాల్లో భాగంగా శుక్రవారం అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకం విశేష పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రీ గణపతి హోమం, శ్రీ ధర్మశాస్త్ర,శ్రీ మృత్యుంజయ, రుద్ర హోమాలు భాస్కర శాస్త్రీచే శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అన్నప్రసాద వినియోగం జరిగింది. సాయంత్రం అంగరంగ వైభవంగా, మేళ తాళాలతో, డప్పు వాయిద్యాలతో, కన్నుల పండుగ బ్రాహ్మణ కాక వారిచే కోలాటం, తాడేపల్లిగూడెం వారిచే కాంతారా సాంస్కృతిక కార్యక్రమాలతో శ్రీ అయ్యప్ప స్వామి నగర ఉత్సవం నిర్వహించారు. ఇంటింటి వద్ద స్వామివారికి భక్తులు హారతి ఇచ్చారు.ఈ కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప స్వామి సేవా సంఘం సభ్యులు కాటా చెంచురామయ్య, నల్లబోతుల మురళి, దాసరి శ్రీనివాసులు, ఉన్నం వీరస్వామి, ఇస్కాల వెంకట నరసింహం, మాదాల వెంకటేశ్వర్లు, అయ్యప్ప స్వామి భక్తులు, మాలధారణ స్వాములు నగర ఉత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
What's Your Reaction?






