మాలకొండ దేవాలయానికి పోటెత్తిన భక్తుల

మాలకొండ దేవాలయానికి పోటెత్తిన భక్తులు.
వలేటివారిపాలెం జనసాక్షి : వలేటివారిపాలెం మండలంలోని అయ్యవారిపల్లి పంచాయతీలో వేంచేసి ఉన్న మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహాస్వామి దేవస్థానానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఏపీ రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దేవాదాయ శాఖ ఉపకమీషనర్, ఆలయకార్యనిర్వాహనాధికారి కె. బి. శ్రీనివాసరావు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించారు. ఎస్సైై బాలుమహేంద్ర నాయక్ ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు.
What's Your Reaction?






