మధుసూదన్ కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున పది లక్షల చెక్కును అందజేసిన వేమిరెడ్డి

Apr 27, 2025 - 13:14
Apr 27, 2025 - 13:19
 0  333
మధుసూదన్ కుటుంబ  సభ్యులకు  రాష్ట్ర ప్రభుత్వం తరుపున  పది లక్షల చెక్కును అందజేసిన వేమిరెడ్డి

కాశ్మీర్ ఉగ్రవాద ఘటనలో మృతి చెందిన మధుసూదన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర

రాష్ట్ర ప్రభుత్వం తరఫున 10 లక్షల రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేసిన ఎంపీ వేమిరెడ్డి

మధుసూదన్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని స్పష్టం చేసిన నేతలు

పిల్లల భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి పెట్టి వారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్న నాయకులు

ఎంపీ వేమిరెడ్డి కామెంట్స్.

దేశంలో ఉగ్రవాద చర్య జరగడం చాలా దురదృష్టకరం

మధుసూదన్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటం

కేంద్ర ప్రభుత్వం తరఫున వారికి అందాల్సిన సదుపాయాలను అందజేసే ప్రయత్నం చేస్తాం

అవసరమైతే కుటుంబంలో ఒకరికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చిల కృషి చేస్తాం 

దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయాలకు మేమంతా కట్టుబడి ఉన్నాం 

దేశంలో ఉగ్రవాదాన్ని ఏరిపారేస్తాం

ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర కామెంట్స్...

ఉగ్రవాద దాడులు జరగడం దురదృష్టకరం 

మధుసూదన్ రావు మృతి చెందడం ఆ కుటుంబానికి తీరని లోటు 

మధుసూదన్ కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం తరఫున 10 లక్షలు చెక్కును అందజేశాం 

పాకిస్తాన్ చర్యలను ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ఎదుర్కొందాం 

ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు భారతదేశం ఏకం అవ్వాల్సిన అవసరం ఉంది 

వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow