జాతీయ రహదారి రాజుపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

Aug 15, 2026 - 14:07
Aug 15, 2026 - 14:10
 0  175
జాతీయ రహదారి  రాజుపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

ఉలవపాడు–రాజుపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న తల్లి, కుమారుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో కుమారుడిపై నుంచి వాహనం దూసుకెళ్లడంతో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లికి స్వల్ప గాయాలయ్యాయి.మృతుడిని చాగొల్లు గ్రామానికి చెందిన మెండా కిషోర్గా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow