సింగరాయకొండ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

Sep 26, 2026 - 09:07
 0  183
సింగరాయకొండ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

సింగరాయకొండ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

-ఇద్దరు మృతి.. ముగ్గురి పరిస్థితి విషమం,

శిఖర జనసాక్షి,సింగరాయకొండ: మండల పరిధిలోని జాతీయ రహదారిపై గోల్డెన్ కేఫ్ టీ స్టాల్ సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.ప్రాథమిక సమాచారం మేరకు నెల్లూరు నుంచి ఒంగోలు వైపు కారు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. తీవ్రంగా గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow