మోంథా తుఫాన్ అప్డేట్
మోంథా తీవ్ర తుఫాను-- -పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన "మోంథా"తుఫాను గత 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదిలి, తీవ్ర తుఫానుగా బలపడి , ఈరోజు, అక్టోబర్ 28, 2025న ఉదయం 0530 గంటలకు మచిలీపట్నం (ఆంధ్రప్రదేశ్) కి ఆగ్నేయంగా 190 కి.మీ దూరములో ., కాకినాడ (ఆంధ్రప్రదేశ్) కి ఆగ్నేయంగా 270 కి.మీ.దూరములో , విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్) కి ఆగ్నేయంగా 340 కి.మీ.,దూరములో గోపాల్‌పూర్ (ఒడిశా) కి ఆగ్నేయంగా 550 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.
28 .10 .2025 ---ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ, అక్టోబర్ 28 సాయంత్రం/రాత్రి సమయంలో మచిలీపట్నం మరియు కళింగపట్నం మధ్య కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరాన్ని దాటే అవకాశం ఉంది, తీరము దాటే సమయములో స్థిరమైన గాలులు గరిష్టంగా గంటకు 90-100 కి.మీ వేగంతో గరిష్టంగా 110 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి.
తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణ, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలు మరియు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లలో వివిక్త అత్యంత భారీ వర్షాలతో భారీగా వర్షపాతం ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశముంది .మిగిలిన ఆంధ్ర ప్రదేశ్ అన్ని జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షపాతం ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశముంది .
29.10 .2025 ---గుంటూరు, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యము మరియు విజయనగరం అనేక ప్రాంతాలలో అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశముంది. మిగిలిన ఆంధ్ర ప్రదేశ్ అన్ని జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షపాతం ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశముంది .
2025 , అక్టోబర్, 28 & 29 తేదీలలో తీరం వెంబడి పెనుగాలులు గంటకు 90-100 కి.మీ. వేగంతో గరిష్టంగా 110 కి.మీ. వేగంతో వీస్తాయి.
చెట్లు/విద్యుత్ స్తంభాలు/కమ్యూనికేషన్ స్తంభాలు కూలిపోవడం, వరదలు, పిడుగులు, మట్టి పెళ్లలు విరిగి పడటం /బురద జారిపోవడం, రోడ్లు దెబ్బతినడం, బలహీనమైన నిర్మాణాలు/గుడిసెలు కూలిపోయే అవకాశం ఉన్నందున, దయచేసి అక్టోబర్ 28, 29 తేదీలలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలు అనవసరమైన ప్రయాణాలను నివారించి , సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని హెచ్చరించడమైనది
What's Your Reaction?