ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీ
కందుకూరు నుండి ఒంగోలు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ను టంగుటూరు నేషనల్ హైవే బిలాల్ హోటల్ సమీపంలో ఒక లారీని బలంగా ఢీకొట్టింది.. బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే బస్సును వేగంగా లారీని ఢీకొట్టడంతో ప్రయాణికులు తీవ్భయాందోళనలకు గురయ్యారు. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న హైవే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును, బస్సు దెబ్బతిన్న విధానాన్ని వారు పరిశీలిస్తున్నారు. రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోకుండా వాహనాలను పక్కకు తప్పించి, రాకపోకలను పునరుద్ధరించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
What's Your Reaction?