నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్షకు గడువు ఆగస్టు 10 వరకు పొడిగింపు

Aug 8, 2026 - 12:22
 0  17
నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్షకు  గడువు ఆగస్టు 10 వరకు పొడిగింపు

నవోదయ 6 వ తరగతి ప్రవేశ పరీక్షకు గడువు ఆగస్టు 10 వరకు పొడిగింపు

ఒంగోలు జవహర్ నవోదయ పాఠశాలలో 6 వ తరగతికి అడ్మిషన్లకు నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు గడువు పొడిగిం చారని ప్రిన్సిపల్ సి.శివరాం శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రకాశం జిల్లా పరిధిలో 5 వతరగతి చదువుతున్న విద్యార్థులు జవహర్ నవోదయ పాఠశాలలో అడ్మిషన్లు పొందవచ్చన్నారు. ఈ అడ్మిషన్లకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 2027-28వ సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 10 వ తేదీ వరకు గడువు పొడిగించారన్నారు.ఈ నెల 11,12 తేది లలో దరఖాస్తు పత్రాలలో ఏమైనా తప్పులు ఉంటే సవరణకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow