కందుకూరులో కాక రేపుతున్న దాసరి మాల్యాద్రి పై కేసు.!
కందుకూరులో కాక రేపుతున్న దాసరి మాల్యాద్రి పై కేసు!
ఎన్నికల నగారా మోగకముందే కందుకూరులో రాజకీయ వేడి తారస్థాయికి చేరుతోంది. మున్సిపాలిటీలో గ్రామాల విలీనంపై హైకోర్టులో కొనసాగుతున్న పిటిషన్ చుట్టూ రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. కందుకూరు పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ దాసరి మాల్యాద్రి కందుకూరు మున్సిపాలిటీలో వీలైన మైన గ్రామాలను తొలగించాలని కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసును ఉపసంహరించుకోవాలంటూ మాజీ కౌన్సిలర్ దాసరి మాల్యాద్రిపై ఒత్తిళ్లు వచ్చాయన్న ఆరోపణలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.ఒత్తిళ్లకు తలొగ్గకుండా పిటిషన్‌ను కొనసాగిస్తానని మాల్యాద్రి వర్గం చెబుతున్న నేపథ్యంలో.. తాజాగా ఆయనపై పోలీసులకు వచ్చిన ఫిర్యాదు మరింత రాజకీయ వేడిని పెంచింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారంలో మాల్యాద్రి వేధిస్తున్నారంటూ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై విచారణకు హాజరు కావాలని పోలీసులు మాల్యాద్రికిి సూచించడంతో ఇప్పుడు కందుకూరులో ప్రధాన చర్చగా మారింది. రాజకీయ ఒత్తిళ్లలో భాగంగానే ఫిర్యాదు తెరపైకి వచ్చిందని మాల్యాద్రి వర్గం ఆరోపిస్తోంది. గ్రామాల విలీనం అంశం కేవలం పరిపాలనా నిర్ణయంగా కాకుండా ఎన్నికల సమీకరణాలతోనూ ముడిపడి ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. దీంతో హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌పై అందరి దృష్టి పడింది. ఈ నెల 24న హైకోర్టులో పిటిషన్ విచారణకు రానుండటంతో ఉత్కంఠ మరింత పెరిగింది..ఎన్నికల బరిలోకి దిగకముందే కందుకూరులో ‘కేసు’ల రాజకీయ వేడి మొదలైందన్న చర్చ ఇప్పుడు కందుకూరు పట్టణంలో ప్రధాన చర్చగా మారింది.
What's Your Reaction?