శ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపం నిర్మాణానికి రూ 69,120 విరాళం

శ్రీ అంకమ్మ తల్లి అనివేటి మండప నిర్మాణానికి రూ 69, 120 విరాళం
కదుకూరు గ్రామదేవత ఆదిపరాశక్తి శ్రీశ్రీశ్రీ అంకమ్మ తల్లి ఆలయ అనివేటి మండప నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అనివేటి మండప నిర్మాణానికి ఆదివారం ఒంగోలుకు చెందిన ముక్తినూతలపాటి వెంకటేశ్వరరావు ధర్మపత్ని లావణ్య లక్ష్మి కుమారులు అరుణ్ వశిష్ట, అనుదీప్ రూ 69,120లు విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యుడు ఆవుల మాధవరావు కి అందజేశారు. దాత ముక్తినూతలపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారు ఎంతో మహిమగల అమ్మవారు అని, అమ్మవారికి మొక్కుకున్నాక తమ కుమారుడికి అమ్మవారి దయతో మంచి ఉద్యోగం వచ్చిందని, మొదటి నెల జీతాన్ని అమ్మవారి అనివేటి మండప నిర్మాణానికి కానుకగా సమర్పిస్తున్నామని తెలిపారు. కమిటీ సభ్యులు ఆవుల మాధవరావు మాట్లాడుతూ అమ్మవారి ఆలయ నిర్మాణానికి సహకరించిన దాతలకు వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మీడియా చైర్మన్ చక్కా వెంకట కేశవరావు,ఉపాధ్యాయులు పి మురళి పాల్గొన్నారు.
What's Your Reaction?






