పేదలకు దుస్తులు పంపిణీ

బాధితులకు అండగా షైన్ ఫౌండేషన్- రహీమ్
కందుకూరు షైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు దుస్తులు పంపిణీ చేశారు, ఊరిబయట శివారు ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలు ఈ మధ్య కురిసిన వర్షాలకు బట్టలు లేక ఇబ్బంది పడుతున్నారని తేలుసుకున్న షైన్ ఫౌండేషన్ వెంటనే స్పందించి వారికి దుస్తులు పంపిణీ చేయడం జరిగింది, ఫౌండేషన్ ప్రెసిడెంట్ రహీమ్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల కాలం నుంచి పేదలకు అనేక రకాలుగా సేవలను అందిస్తూ వస్తున్నాము, ఈ సంస్థ మన అందరిది, నిరుపేదలను ఆదుకోవడమే ప్రధాన లక్ష్యం,అందరి సహాయ సహకారాలతో పేదలకు సంస్థ అండగా నిలుస్తోంది అన్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారికి ధన్యవాదాలు తెలిపారు, ఫౌండేషన్ ప్రతినిధులు , నయీమ్ భాష, రసూల్ ,మస్తాన్, వెంకటేశ్వర్లు, బాబు, ఉన్నారు.
What's Your Reaction?






