వరద బాధితుల సహాయార్థం వేమిరెడ్డి దంపతులు కోటి రూపాయలు విరాళం

వరద బాధితుల సహాయార్థం వేమిరెడ్డి దంపతుల భూరి విరాళం
- వరద బాధితులను ఆదుకునేందుకు రూ. కోటి విరాళం అందజేత
- విజయవాడలో సీఎం చంద్రబాబు గారికి చెక్కు అందించిన వేమిరెడ్డి దంపతులు
జనసాక్షి : నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు భూరి విరాళం అందించారు. వరదలతో తీవ్రంగా నష్టపోయిన వారికి సహాయ సహకారాలు అందించేందుకు, వారిని ఆదుకునేందుకు కోటి రూపాయలను విరాళం అందించారు. ఈ మేరకు మంగళవారం విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి కోటి రూపాయల చెక్కును అందించారు. ఇటీవల వచ్చిన వరదలతో విజయవాడ తీవ్రంగా నష్టపోయింది. వేలాదిమంది ప్రజలు తిండీ, నీరు లేక అల్లాడిపోయారు. ఇప్పటికీ పలు కాలనీలు జల దిగ్భంధంలో ఉండిపోయాయి. సీఎం చంద్రబాబు ఇప్పటికే దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. అన్నార్తులు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరదలతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డ ప్రజల సహాయార్థం, వారి బాగోగుల కోసం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు కోటి రూపాయలను విరాళంగా అందించి మానవత్వం చాటుకున్నారు. విపత్తు నుంచి ప్రజలు త్వరగా బయటపడాలని ఆయన ఆకాంక్షించారు. రూ. కోటి రూపాయలు అందించిన వేమిరెడ్డి దంపతులను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు , నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?






