అలివేటి మండపానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి

అలివేటి మండపానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి
కందుకూరు జనసాక్షి : కందుకూరు గ్రామ దేవత శ్రీశ్రీ శ్రీ అంకమ్మ తల్లి దేవాలయానికి అనుసంధాంగా నూతన అలివేటి మండపం నిర్మాణానికి ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లి దేవాలయం పున : నిర్మాణం మొదటి దశ గర్భాలయం, అంతరాలయం, ప్రదక్షణ మండపం, ఉపాలయం, అమ్మవారి విగ్రహ ప్రతిష్ట తో పూర్తి అయినట్లు తెలిపారు. అంకమ్మ తల్లి దేవాలయం ముందు భాగములో మూడున్నర కోట్ల అంచనా వ్యయంతో శ్రీ అంకమ్మ తల్లి అలివేటి మండపానికి ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు సూచన మేరకు శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. శ్రీ అంకమ్మ తల్లి ఆలయానికి ఊహించిన దానికంటే అమ్మవారి భక్తులు విరాళాలను అందజేశారని, అదేవిధంగా అలివేటి మండపానికి కూడా భక్తులు తమకు శక్తి కొలది విరాళాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఆలయ నిర్మాణ కమిటీ, ఆలయ శిల్పి సమావేశమై త్వరలోనే అలివేటి మండపం డిజైన్ ను నిర్ణయిస్తారని చెప్పారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు, అవకాశం లేక పాల్గొనలేకపోయిన భక్తులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దివి లింగయ్య నాయుడు, కొండూరి వసంతరావు, తల్లపనేని వెంకటేశ్వర్లు, పిడికిటి వెంకటేశ్వర్లు, కొడాలి కోటేశ్వరరావు, ఎనిమిరెడ్డి వెంకటరెడ్డి, సూరం వేణుగోపాల్ రెడ్డి, మాదాల మాల్యాద్రి, ఆవుల మాధవరావు, విశ్రాంత ఎంపీడీవోలు వెంకటేశ్వర్లు, మాల కొండయ్య, భక్తులు పాల్గొన్నారు.
What's Your Reaction?






