రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ముండ్లమూరి వారి పాలెం పాఠశాల విద్యార్థులు ఎంపిక.

Oct 3, 2023 - 22:51
Oct 3, 2023 - 22:54
 0  155
రాష్ట్రస్థాయి  యోగా  పోటీలకు ముండ్లమూరి వారి పాలెం  పాఠశాల విద్యార్థులు ఎంపిక.

రాష్ట్రస్థాయి యోగా పోటీలకు 

ముండ్లమూరివారి పాలెం విద్యార్థులు ఎంపిక.

 పొన్నలూరు జనసాక్షి : పొన్నలూరు మండలం ముండ్లమూరివారి పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఎన్. శివరామకృష్ణ మాట్లాడుతూ ఒంగోలు గద్దలగుంట ఎస్ పి కే వి ఓరియంటల్ పాఠశాల లో జరిగిన జిల్లాస్థాయి యోగా పోటీల్లో ఎనిమిరెడ్డి రూప శ్రీ, పొంతగాని తిరుమల అమర్, నల్లపు అక్షయ్ ఎంపికైనట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులు అక్టోబర్ రెండవ వారంలో పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించబోయే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రస్థాయిలో పోటీలలో గెలుపొంది పాఠశాలకు మంచి పేరు తీసుకొని రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పిడి గుమ్మా శ్రీదేవిని, ఎంపికైన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు శివరామకృష్ణ, సర్పంచి దగ్గుబాటి లక్ష్మి కుమారి, గోరంట్ల కేశవరావు, ఆర్యవైశ్య మీడియా చైర్మన్ చక్కా వెంకట కేశవరావు, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow