రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అగ్నిమాపక శాఖపై పూర్తిస్థాయి సమీక్ష

జనసాక్షి :
హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన రాష్ట్ర విపత్తులు న్విహణ మరియు అగ్నిమాపక శాఖ పై పూర్తిస్థాయి సమీక్ష సమావేశం జరిగింది.
Principle Secretary, Home Dept. హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ మరియు DG ఫైర్ గా పూర్తి అదనపు భాద్యతలు నిర్వహిస్తున్న శంక బత్ర బాక్షి IPS మరియు ఫైర్ శాఖ అదనపుసంచాలకులు, ఫైర్ అధికారులు పాల్గున్నారు.
ముఖ్యంగా అగ్నిమాపక శాఖ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన,అగ్నిమాపక వాహనాలు గురించి చర్చించడం మరియు భవనాల నిర్మాణానికి తగిన వనరులు సమకూర్చుకొనుట గురించి చర్చించడం జరిగినది.
ఇందులో భాగంగా 15వ ఆర్థిక సంఘం అగ్నిమాపక సేవల ఆధునికీకరణ క్రింద వచ్చే నిధులను సక్రమంగా వినియోగించుకొనుటకు తగిన ప్రణాళిక రూపొందించుకొని, పూర్తిగా ఖర్చు పెట్టేవిధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులను హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించడమైనది.
ప్రభుత్వం అత్యవసర పనులకు అవసరమైన నిధులు సమకూర్చి అగ్నిమాపక శాఖ తక్షణ అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడమైనది.
రాబోవు 5 సం॥ల్లో అగ్నిమాపక శాఖ ఆధునీకరణ పరికరాలు మరియు వసతులతో ఒక దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించుకొని ఎటువంటి విపత్తులు, అగ్నిప్రమాదాలు, తుపాన్లు, వరదలు, రోడ్స్ రైల్ ప్రమాదాలను పూర్తి స్థాయిలో ఎదుర్కొనేందుకు సమాయత్తం అయ్యేలా ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది.
What's Your Reaction?






