గాంధీ జీవితం గొప్ప స్ఫూర్తిదాయకం

- కందుకూరు జనసాక్షి
: ఈ దేశ స్వాతంత్రానికి నాంది వేసి సాధించిన మహనీయుడు మహాత్మ గాంధీజీ అని వారి జయంతిని జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. సోమవారం కందుకూరు పట్టణ వైయస్సార్ సీ పీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి లర్పించారు. సందర్భంగా మహీధర్ రెడ్డి మాట్లాడుతూ సత్యాన్ని నమ్మిన గాంధీ సత్యాగ్రహం ద్వారానే స్వాతంత్ర్యం సాధించారని, గాంధీ గారి ఆశయాలు మనం మననం చేసుకుంటు వాటిని ఆచరణలో పెట్టుకోవడంలో సంతృప్తి ఉంటుందన్నారు. గాంధీజీ అహింసా విధానం వలన ఎటువంటి క్లిష్టతరమైన కఠినమైన సమస్యలను కూడా పరిష్కరించుకోవచ్చని సందేశాన్ని భారతావనికి అందించారన్నారు. వారి యొక్క సాదాసీదా జీవన విధానం పరిశీలిస్తే నేడు ఉన్న కొద్దిపాటి గుర్తింపుకే మనం ఎక్కువ ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నామన్నారు. నూలు బట్టలు తప్పితే వేరే బట్టలు వాడనని స్వయంగా మగ్గాలపై బట్టలు నేసిన మహనీయుడు గాంధీ అని అన్నారు . ఉప్పు సత్యాగ్రహం ద్వారా ఈ దేశానికి స్వాతంత్ర సమపార్జనకు బాటలు వేసి ఎందరో మహనీయులు తోడు రాగా వారి బలిదానాలు వృధా పోకుండా చెక్కుచెదరని మనో ధైర్యంతో వారి యొక్క త్యాగనిరతని కొనసాగిస్తూ శాంతియుత పోరాటం ద్వారా స్వాతంత్ర్యం సాధించిన మహనీయుడన్నారు. వారి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం అటువంటి మహనీయుడిని స్మరించుకుంటూ జయంతి వేడుకలు జరుపుకోవడం గొప్ప విషయమన్నారు. జరగబోయే కాలంలో కూడా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రపంచంలోనే భారతదేశం ఒక గొప్ప దేశంగా పేరు తెచ్చుకునే దిశలో మనం పయనిస్తున్నామన్నారు. ఈరోజు ఈ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ ప్రశాంతంగా వున్నామని వారి సేవలను కొనియాడుతూ దేశ ప్రజలందరూ గాంధీ జయంతి జరుపుకొంటున్నారన్నారు.
What's Your Reaction?






