మానవ జీవితంలో మరణం సహజం

మానవ జీవితంలో మరణం సహజం...
-పెద్ద ను కోల్పోయిన కుటుంబానికి ఎంత సాయం చేసిన లోటు తీర్చలేనిది...
-మృతుని కుటుంబానికి అండగా వుంటాం... మానుగుంట మహిధరరెడ్డి భరోసా
కందుకూరు జనసాక్షి : కందుకూరు మున్సిపాలిటీలోని బిలాల్ నగర్ సచివాలయం దూబగుంట క్లస్టర్ పరిధిలోని గృహ సారథి మృతుడు చదలవాడ కోటేశ్వరరావు కుటుంబ సభ్యులను శాసనసభ్యులు మానుగుంట మహిధరరెడ్డి శనివారం పరామర్శించి మనోధైర్యం కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా గృహ సారధి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జేసీఎస్ వ్యవస్థ ద్వారా నియమించిన సచివాలయం గృహ సారథి చదలవాడ కోటేశ్వరరావు మృతి వైయస్సార్ సిపి పార్టీ కి తీరనిలోటు అని ఆయన అన్నారు. కోటేశ్వరరావు పార్టీ కోసం ,జగనన్న కోసం సైనికుని వలే పని చేసాడు. అతని సేవలను పార్టీ ఎప్పటికీ మరువదు. మానవ జీవితంలో మరణం సహజం విధి రాత ఎవ్వరూ మార్చలేనిది అని అన్నారు. చిన్న వయసులోనే కుటుంబానికి దూరమైన కోటేశ్వరరావు ( కుటుంబ పెద్ద) లేని లోటు తీర్చలేనిది ఎంత సాయం చేసిన పరిపూర్ణమవ్వ దు అని అన్నారు. మృతుడు కోటేశ్వరరావు కుమారుడు, కూతురు లను ఓదార్చి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఏం టెక్ చదువుతున్న కుమారుడుతో మాట్లాడుతూ ఉన్నత స్థాయికి చేరి మీ తండ్రి కల సాకారం చేయాలని ఆయన కోరారు. మీ కుటుంబానికి ఎటువంటి సహాయం అందించడం కోసం తోడుగా వుంటాం అని భరోసా కల్పించారు. వైయస్సార్ భీమా కాకుండా రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చెక్ రూపంలో మృతుని కుటుంబ సభ్యులకు అందించడం అందజేశారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈకార్యక్రమంలో జేసీఎస్ కో ఆర్డినేటర్ ముప్పవరపు కిషోర్, పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీ, సచివాలయం కన్వీనర్లు పల్నాటి చెన్నయ్య, పాశం కొండయ్య, భోగిశెట్టి దత్తాత్రేయ, చనమాల కోటేశ్వరరావు, షేక్ రహీం, మాజీ ఏఎంసి చైర్మన్ తోకల కొండయ్య, గణేషం గంగిరెడ్డి, పల్నాటి బాలకృష్ణ,మేళం నాగేశ్వరరావు, చదలవాడ జక్రయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?






