పెంచుతున్న విద్యుత్ చార్జీలకు నిరసనగా ప్రజా బ్యాలెట్

కందుకూరు పట్టణంలో సిపిఎం, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో కందుకూరు పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం పెంచుతున్న కరెంటు చార్జీలకు నిరసనగా ప్రజా బ్యాలెట్ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని లాయర్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం.మల్లికార్జున ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.మాలకొండయ్య, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్ ఏ. గౌస్, సిపిఎం సీనియర్ నాయకులు ముప్పరాజు కోటయ్య, గుడ్లూరు సిపిఎం మండల బాధ్యులు జి. వెంకటేశ్వర్లు, ఉలవపాడు సిపిఎం మండల బాధ్యులు జీవీబీ కుమార్,సిపిఎం కందుకూరు పట్టణ నాయకులు డి. రామ్మూర్తి, ఎస్.కె మున్వర్ సుల్తానా,ఎం.పద్మ, సిపిఐ కందుకూరు ఏరియా కార్యదర్శి భూసి సురేష్,మాలకొండయ్య ఆనందమోహన్, సిపిఎం డి. మాలకొండ నాయుడు, ఎం. ప్రసాద్, ప్రజాసంఘాల నాయకులు బివి వెంకటేశ్వర్లు వార్డెన్, పాలేటి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?






