డోన్ కెమెరాలతో అసాంఘిక కార్యక్రమాలకు చెక్

డ్రోన్ కెమెరాలతో అసాంఘిక కార్యకలాపాలకు చెక్
నేరాల నియంత్రణకు కట్టడి: డీఎస్పీ బాలసుబ్రమణ్యం
నెల్లూరు జిల్లా పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాలు & ట్రాఫిక్, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా, విపత్తు నిర్వహణ, ఇతర పోలీసింగ్ అవసరాల కోసం ఇండో సోల్ కంపెనీ వారు నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ సూచనలతో కందుకూరు డిఎస్పి కార్యాలయంలో డీఎస్పీకి అత్యాధునిక సాంకేతికతతో కూడిన DJI Air3s డ్రోన్ కెమెరాను మంగళవారంం అందచేశారు. నెల్లూరు జిల్లాలో కందుకూరు డివిజన్ పోలీస్ శాఖకు సామాజిక బాధ్యత, సేవా స్పూర్తితో ఒక డ్రోన్‌ను బహుకరించడం అభినందనీయమని డీఎస్పీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ డ్రోన్ ను గుడ్లూరు పోలీస్ స్టేషన్ కు డీఎస్పీ గారు అందచేశారు.
కందుకూరు డీఎస్పీ బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి నేరాల కట్టడికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం నేరాల నియంత్రణలో, శాంతిభద్రతల పరిరక్షణలో, అత్యవసర పరిస్థితుల్లో పోలీసు సిబ్బందికి ఎంతో ఉపయోగపడుతుందని, ఈ డ్రోన్ కెమెరా అధిక రిజల్యూషన్ కలిగిన చిత్రాలు, వీడియోలను తీయగలదని, దీని ద్వారా విస్తృతమైన ప్రాంతాలను నిఘా ఉంచడానికి, నేరస్థలాలను పరిశీలించడానికి, ట్రాఫిక్ ను పర్యవేక్షించడానికి వీలవుతుందన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రాంతాలు, ఇతర నేరాలకు అవకాశం ఉన్న శివారు/నివాసిత ప్రాంతాలు, తోటలు, బహిరంగ ప్రదేశాలను ముందుగానే గుర్తించి అక్కడకు డ్రోన్లను పంపి నిఘా ఏర్పాటుచేశామన్నారు. వీవీఐపీలు, వీఐపీల బందోబస్తుల్లోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాల సాయంతో పర్యవేక్షిస్తున్నామన్నారు. ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణ, సుదూర ప్రాంతాలు ఉన్న వ్యక్తులపై నిఘా పెట్టేందుకు వీటిని వినియోగిస్తున్నట్లు తెలియజేశారు. పోలీసుల సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తుందని మరియు తద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందించటానికి దోహదపడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో గుడ్లూరు ఎస్సై వెంకట్రావు ఇండో సోలార్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
What's Your Reaction?






