నాసరయ్యకు తెలుగు కీర్తి జాతీయ ప్రతిభా పురస్కారం

తెలుగు కీర్తి జాతీయ ప్రతిభా పురస్కారం అందుకున్న గొట్టిముక్కుల నాసరయ్య
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలానికి చెందిన స్థానిక కవి, ప్రముఖ రచయిత, తెలుగు అధ్యాపకులు గొట్టిముక్కుల నాసరయ్యకు మంగళవారం విజయవాడలోని శ్రీ కౌత పూర్ణానంద్ విలాస్ కళావేదికనందు తెలుగు భాషా, తెలుగు సాహిత్యం, తెలుగు వైభవం, తెలుగు సంస్కృతి - సంప్రదాయాలు తెలుగు కళల పరిరక్షణకు మరియు అభివృద్ధికి గొట్టిముక్కుల నాసరయ్య చేస్తున్న సేవలను గుర్తించి అభినందిస్తూ తెలుగు కీర్తి జాతీయ ప్రతిభా పురస్కారంతో అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ కత్తిమండ ప్రతాప్, బోయి భీమన్న సాహిత్య నిధి చైర్ పర్సన్ బోయి హైమావతి, ఏపీఎస్ పిఎఫ్ కమాండెడ్ డా. కొండా నరసింహారావు శ్రీమతి అలివేలు మంగాదేవి, జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి, జాతీయ అధ్యక్షురాలు జి. ఈశ్వరి భూషణం, జాతీయ ప్రధాన కార్యదర్శి డా. టి. పార్థసారథి, టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి గద్దె అనంతలక్ష్మి, శ్రీనాధుని 13 వ తరం వంశీయులు శ్రీ డా. కావూరి శ్రీనివాస శర్మ తదితరుల చేతుల మీద ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాసరయ్య మాట్లాడుతూ తెలుగు కీర్తి పురస్కారం రావటంపట్ల తనపై బాధ్యత పెరిగిందని తెలిపారు, నాసరయ్యను తల్లిదండ్రులు, గురువులు, బంధుమిత్రులు, ఉభయ రాష్ట్రాల తెలుగు కవులు, కళాకారులు అభినందించారు.
What's Your Reaction?






