రాళ్లపాడు ప్రాజెక్టు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే

రాళ్లపాడు ప్రాజెక్టు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే
కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గత తొమ్మిది రోజులుగా రాళ్లపాడు ప్రాజెక్టులో ఇబ్బంది కరంగా పరిణమించిన కుడి కాలువ షట్టర్ సమస్యను సంబంధిత శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకెళ్ళారు. రాళ్లపాడులో చివరి పంట పొలాల రైతులకు సైతము నీరు సంపూర్ణంగా అందిస్తామని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. రాళ్లపాడు ప్రాజెక్టులో సత్వరమే చేపట్టవలసిన పలు పనులను ఆయన నీటిపారుదల శాఖ అధికారుల నుండి నివేదికలు తీసుకొని సంబంధిత శాఖ మంత్రి సమర్పించారు. ఆదివారం అదనంగా మరో రెండు పెద్ద మోటార్లతో నీరు సరఫరా చేస్తున్నారు. మొత్తం ఈరోజు నాలుగు పెద్ద మోటర్లు, 75. హార్స్ పవర్ కలిగినవి, నిరంతరాయంగా నీరు సరఫరా చేయనున్నట్లు ఆయన చెప్పారు. దీంతో సాయంత్రానికల్లా 160. క్యూసెక్కుల నీటిని సరఫరా చేయడం జరుగుతుందన్నారు. నిమ్మల రామానాయుడు ఆదేశానుసారం నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ఆదివారం ఉదయం రాళ్లపాడు ప్రాజెక్టును సందర్శించారు. ఆయన ప్రాజెక్టు వద్ద 35. నిమిషాల పాటు రాళ్లపాడు రైతులతో పలు అంశాలను చర్చించారు. రైతులకు నీరందించడంలో రాజీ పడబోమన్నారు .కార్యక్రమంలో కందుకూరు సబ్ కలెక్టర్ కూడా పాల్గొన్నారు.
What's Your Reaction?






