మహాచండీ దేవిగా నేడు దుర్గమ్మ దేవి దర్శనం

మహాచండీ దేవిగా నేడు దుర్గమ్మ దర్శనం..
శరన్నవరాత్రుల్లో ఈ ఏడాది ఈ అలంకరణ ప్రత్యేకం
మెరుపు మెరిస్తే ఎంత వెలుగుగా ఉంటుందో అంతటి తేజోమయమైన రూపంతో సాక్షాత్కారం
జనసాక్షి ఇంద్రకీలాద్రి:- దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా 5వ గురువారం ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ శ్రీ చండీ దేవిగా దర్శనమిస్తుంది. ఈ ఏడాది శరన్నవరాత్రుల్లో చండీ దేవి అలంకరణ ప్రత్యేకం. జగజ్జననీ అయిన దుర్గామాత ఈ రోజున ఒక మెరుపు మెరిస్తే ఎంత వెలుగుగా ఉంటుందో అంతటి తేజోమయమైన రూపంతో అమ్మవారు సింహం భుజములపై భీషణంగా కూర్చొని తన ఎనిమిది చేతుల యందు వివిధ రకాల ఆయుధాలను దరించి, రాక్షస సంహారం గావించి లోక కళ్యాణం జరిపించిన దివ్యమైన రూపంతో భక్తులను బంగారు రంగు చీరలో సాక్షాత్కరిస్తుంది. పంచమి పర్వదినం రోజున చండీ పారాయణం, చండీ యాగం చేస్తారు. చండీ దేవిగా దర్శనమిచ్చే జగన్మాత కనకదుర్గమ్మకు ఈ రోజున నైవేద్యంగా తెల్ల నువ్వులు కలిపిన బెల్లం పొంగలి, వడలు నివేదిస్తారు..
What's Your Reaction?






