2000 సభ్యత్వ నమోదులు అభినందనీయం
ఇందుకూరు పేట మండలం మైపాడు గ్రామంలో అత్యంత వేగంగా దాదాపు 2 వేల టిడిపి సభ్యత్వాలు పూర్తి చేయడం అభినందనీయమని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి , కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు అన్నారు. మైపాడులో టిడిపి కార్యకర్తలు దాదాపు 2 వేల సభ్యత్వాలు పూర్తి చేయడంపై నెల్లూరులోని విపిఆర్ నివాసంలో ఆదివారం కార్యకర్తలను వేమిరెడ్డి దంపతులు ప్రత్యేకంగా అభినందించారు. గ్రామంలో ఉన్న ఓటర్లలో 40 శాతం సభ్యత్వాలు పూర్తి చేయడం శుభ పరిణామన్నారు. అందరి సహకారంతో ఇన్ని సభ్యత్వాలు పూర్తి చేయగలిగారని అన్నారు.