ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యం

జనసాక్షి :ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యం అని జే సి ఎస్ కో ఆర్డినేటర్ ముప్పవరపు కిషోర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కందుకూరు అర్బన్ పరిధిలోని గుర్రంవారి పాలెం సచివాలయం పరిధిలో కమిషనర్ ఎస్. మనోహర్ అధ్యక్షతన గురువారం జరిగింది. ఈసందర్భంగా జె సి యస్ కో ఆర్డినేటర్ ముప్పవరపు కిషోర్ మాట్లాడుతూ ప్రజలందరికీ ఆరోగ్యం చేకూరాలని సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలు చేస్తున్నారు అని అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్షలో జనరల్ వైద్య నిపుణులు, స్త్రీల వైద్య నిపుణులు, కంటి వైద్య నిపుణులు అవసరమైన పరీక్షలు నిర్వహించి చికిత్సలు చేస్తున్నారన్నారు.. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లుులు తెలిపారు. ఎమ్మెల్యే మానుగుంట మహిధరరెడ్డి పర్యవేక్షణలో సచివాలయం వారిగా ఆరోగ్య సురక్ష క్యాంపులు ప్రజలందరికీ అందుబాటులో వుండే విధంగా మున్సిపల్ కమిషనర్ మనోహర్ గారు ఏర్పాటు చేయటం ద్వారా సచివాలయం పరిధిలో ప్రజలు క్యాంపులు విరివిగా వినియోగించుకుంటున్నారు. ఆరోగ్య శిబిరాలు వద్ద ఏర్పాటు చేసిన వివిధ రకాల బలవర్థకమైన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని అంగన్వాడీ కార్యకర్తలు ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేసి వివరిస్తున్నారు. ఈకార్యక్రమంలో సచివాలయం కన్వీనర్లు షేక్ మస్తాన్ బాషా, మల్లీశ్వరి, షేక్ పకృద్ధీన్ ఆలీ అహ్మద్,గృహ సారథులు, వాలంటీర్లు, మున్సిపల్ డి. ఈ రమేష్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, వైద్యులు ఆశావర్కర్లు, ఏ యన్ యం లు తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?






