నెల్లూరు జిల్లాలో పండుగలా ప్రారంభమైన పింఛన్ల పంపిణీ

Jul 1, 2024 - 07:16
Jul 1, 2024 - 07:17
 0  358
నెల్లూరు జిల్లాలో పండుగలా ప్రారంభమైన పింఛన్ల పంపిణీ

పండుగలా ప్రారంభమైన పింఛన్ల పంపిణీ

- నెల్లూరు సిటీ పరిధిలోని యలమల వారిదిన్నెలో పింఛన్లు అందించిన ఎంపీ వేమిరెడ్డి, మంత్రి నారాయణ 

- సంతోషం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు, సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన లబ్ధిదారులు

 నెల్లూరు జనసాక్షి  :జిల్లాలో పింఛన్ల పంపిణీ అట్టహాసంగా ప్రారంభమైంది ఉదయం 6 గంటల నుంచే పింఛనుదారుల ఇళ్ల వద్దకే పింఛన్లు రావడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు సిటీ పరిధిలోని యలమల వారి దిన్నెలో పార్లమెంటు సభ్యులు  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పింఛన్ల పంపిణీని అట్టహాసంగా ప్రారంభించారు. ఇంటి వద్దకే వెళ్లి పెరిగిన పెన్షన్ అమౌంట్ను లబ్ధిదారులకు అందించారు. వృద్ధులకు, వితంతువులకు 4000 తో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలకి సంబంధించిన 3000 రూపాయలు మొత్తం కలిపి 7000 రూపాయలను అందించారు. దివ్యాంగులకు 6000 పెన్షన్ అందించి వారిలో సంతోషం నింపారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow