ఆధునిక తెలుగు సాహిత్యానికి గుర్రం జాషువాకు ప్రత్యేక స్థానం

కందుకూరు జనసాక్షి :ఆధునిక తెలుగు సాహిత్యానికి గుర్రం జాషువాకు ఒక ప్రత్యేకమైన స్థానం అని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. కందుకూరు పట్టణ వైయస్సార్ సీపీ కార్యాలయంలో గుర్రం జాషువా 128 వ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళిలర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి మాట్లాడుతూ జాషువా కవి కవితలంటేనే సామాన్యుడికి కూడా సరళీకృత విధానంలో సామాజిక అంశాలను స్పృశిస్తూ సమాజాన్ని ముందుకు నడిపించాలని, సమాజాన్ని సజీవంగా ఉంచాలి అన్న భావనతో సమాజంలోని అనేక రుగ్మతలను వెలికితీస్తూ, ప్రజలను చైతన్యవంతులను చేస్తూ తన జీవితాన్ని ముగించిన గొప్ప వ్యక్తి జాషువా కొనియాడారు. అటువంటి మహనీయుడు జయంతి సందర్భంగా స్మరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. లోక కళ్యాణానికి ఉపయోగపడని మానవుని కళా కౌశలము ఎంతున్న అది వ్యర్థమే అన్న సందేశాన్ని జాషువా అందిస్తూ విశ్వమానవ ప్రేమ తత్వాన్ని బోధించాడన్నారు. జాషువా భావాలకు అనుగుణంగా ఇంకా సమాజం ఎదగలేదన్న బాధ మనసును కలిసి వేస్తోందన్నారు. నిరంతరం వారిని స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా నడవాలని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఆకాంక్షించారు. కార్యక్రమంలో కందుకూరు పట్టణ వైయస్సార్ సీపీ నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ తోకల కొండయ్య, పట్టణ అధ్యక్షులు ఎస్.కె. రఫీ, రహీం, చనమాల రామారావు, శివ, మురారి శెట్టి శ్రీకాంత్, అయ్యన్న, మహేష్, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?






