ప్రగతి ఛారిటీస్ సంస్థకు వీ పి ఆర్ విరాళం

Jun 30, 2024 - 16:36
Jun 30, 2024 - 16:37
 0  601
ప్రగతి ఛారిటీస్  సంస్థకు వీ పి ఆర్   విరాళం

-ప్రగతి ఛారిటీస్‌ సంస్థకు వి.పి.ఆర్‌ విరాళం

 -రూ.3 లక్షల చెక్కు అందజేసిన వేమిరెడ్డి దంపతులుగులాబీ  పూలతో కృతజ్ఞతలు తెలిపిన చిన్నారులు

 నెల్లూరు జనసాక్షి  : నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి  ప్రభాకర్‌రెడ్డి,  కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి   తమ ఔదార్యం చాటుకున్నారు. నెల్లూరులోని ప్రగతి ఛారిటీస్‌ సంస్థకు రూ.3 లక్షల విరాళం అందించి ఆదుకున్నారు. ఆదివారం ఛారిటీస్‌ ఇన్‌ఛార్జి సుబాష్‌ .. పలువురు చిన్నారులతో కలిసి నెల్లూరులోని వి.పి.ఆర్‌ నివాసంలో ఈ చెక్కును అందుకున్నారు. అనంతరం సుబాష్‌ మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి  ఏటా ప్రగతి ఛారిటీస్‌ నిర్వహణకు 3 లక్షల రూపాయలు అందిస్తున్నారని చెప్పారు. 2012 నుంచి ఏటా ఈ విరాళం అందిస్తూ ఆదుకుంటున్నారని వివరించారు. ప్రగతి ఛారిటీస్‌ ద్వారా మూగ, చెముడు చిన్నారులకు చదువు అందిస్తున్నామన్నారు. అలాగే మెంటల్లీ డిజేబుల్స్‌ చిన్నారుల బాగోగులు చూసుకుంటున్నట్లు వివరించారు. అలాంటి చిన్నారులున్న ప్రగతి ఛారిటీస్‌ కు వి.పి.ఆర్‌ దంపతుల ఔదార్యం మరువలేనిదని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు వేమిరెడ్డి దంపతులకు గులాబీ పూలు అందించి కృతజ్ఞతలు తెలియజేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow