సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఎంపీ వేమిరెడ్డి

సీఎం ఢిల్లీ పర్యటనలో ఎంపీ వేమిరెడ్డి
రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. టీడీపీ ఎంపీలతో కలిసి కేంద్రమంత్రులను కలసిన సీఎం చంద్రబాబు.. ఈ మేరకు రాష్ట్రానికి వివిధ అంశాలపై ఆయన కేంద్రమంత్రులకు వివరించారు. ఈ పర్యటనలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పాల్గొని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్‌ను కలిశారు. పలు అంశాలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. పర్యటనలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.
What's Your Reaction?






