పగడ్బందీగా పోలీస్ కానిస్టేబుల్ నియామక దేహ దారుఢ్య పరీక్షలు

Jan 2, 2025 - 19:25
 0  11

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పకడ్బందీగా కొనసాగుతున్న పోలీసు కానిస్టేబుల్ నియామక దేహ ధారుడ్య పరీక్షలు - ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ 

ఒంగోలు , జన సాక్షి : 

పోలీసు నియామక పక్రియలో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా కు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు ఒంగోలు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించారు. పరీక్షలలో 600 మంది అభ్యర్దులకు గాను 247 మంది అభ్యర్దులు బయోమెట్రిక్ కు హజరయ్యారు. 

వీరికి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తర్వాత ఎత్తు, చాతి వంటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు నిర్వహించారు. అనంతరం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లు 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. గ్రౌండ్ లో సీసీ కెమెరాలు మరియు డ్రోన్ కెమెరాతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ఏ ఆర్ దామోదర్ తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ కల్పించే దళారీలు మాటలు నమ్మవద్దన్నారు. 247 అభ్యర్ధులు గురువారం హాజరయ్యి పాల్గొనగా,188 మెయిన్స్ కొరకు అర్హత సాధించగా వివిధ పరీక్షలలో 59 మంది డిస్ క్వాలిఫై అయ్యారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow