ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోండి కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధులతో - సీఎం చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధులతో బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో ప్రత్యేకంగా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించారు. ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణం, వాటి ప్రాముఖ్యత, అవసరమైన నిధుల గురించి వారికి తెలియజేశారు.పోలవరం—బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాముఖ్యతను, దాని ప్రాధాన్యతను కూడా కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధులకు తెలియజేశారు. అమరావతి రాజధాని నిర్మాణం పైనకూటమి ప్రభుత్వ ఆలోచలనలు, ప్రణాళికలను సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక సంఘంప్రతినిధులకు వివరించారు.
What's Your Reaction?






