శ్రీ శ్రీ కళ వేదిక ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ శ్రీ 114 వ జయంతి వేడుకలు
శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఘనంగా శ్రీశ్రీ 114వ జయంతి వేడుకలు
కందుకూరు లో శ్రీ శ్రీ కి ఘనంగా జయంతి నివాళులు
కందుకూరు జనసాక్షి : ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరులో మంగళవారం శ్రీరంగం శ్రీనివాసరావు 114వ జయంతిని పురస్కరించుకుని, శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ డా. కత్తిమండ ప్రతాప్ గారి సౌరథ్యంలో జాతీయ అధ్యక్షురాలు జి. ఈశ్వరీ భూషణం ఆధ్వర్యంలో శ్రీశ్రీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. స్కందపురి శ్రీ జనార్థన స్వామి కళ్యాణ మంటపం లో శ్రీ శ్రీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన జనార్థన స్వామి ఆలయం చైర్మన్ బి. బ్రహ్మానందం మాట్లాడుతూ సామాన్యుల గళమైన విప్లవ కవి ధీరుడు శ్రీ శ్రీ అని , నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న వారిలో చైతన్యం రగిలించిన మహాకవి శ్రీ శ్రీ అని కొనియాడారు. మరో ముఖ్య అతిథులు బి. వెంకటేశ్వర్లు అభ్యుదయ కవి, రిటైర్డ వార్డెన్ మాట్లాడుతూ నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి అని తట్టి లేపిన మహా ప్రస్థాన నాయకుడు, కలానికున్నా బలాన్ని చాటిన ప్రజలు మెచ్చిన రాతగాడని , స్వయంగా శ్రీ శ్రీ తో తనకున్నా అనుభవాలు అనుభూతులు పంచుకున్నారు. డి.సి హెచ్ మాలకొండయ్య, రిటైడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ శ్రీ గారితో తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. సాహిత్య చైతన్య యజ్ఞం లో సమిధనొక్కటి ఆహుతిచ్చిన విప్లవ కవి అని శ్లాఘించారు. ఆర్యవైశ్య మీడియా చైర్మన్ చక్క వెంకట కేశవరావు శ్రీ పాటల ద్వారా కూడా సమాజాన్ని చైతన్యవంతం చేశారని వారి పాటలు మచ్చుకు వినిపించారు. , మహతి సాహిత్య సంస్థ అధ్యక్షులు మండల విద్యా శాఖ అధికారి తన్నీరు బాలాజీ శ్రీ శ్రీ కళా వేదిక అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ సాహిత్య సేవలను, అంతర్జాతీయంగా సంస్థ విస్తరించి కవులను రచయితలను కళాకారులను ప్రోత్సాహిస్తున్నా తీరును అభినందించారు. రిటైడ్ ప్రధానోపాధ్యాయులు శేషగిరిరావు శ్రీ శ్రీ పాటలు పాడి అందులోని సామాజిక విలువలు తెలియజేశారు. కట్ట సుచరిత, గుర్రం వెంకట స్వామి రిటైర్డ్ ప్రాధానోపాధ్యాయుడు, ఇనకొల్లు మస్తనయ్య ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కళా వేదిక అంతర్జాతీయ స్థాయిలో చేస్తున్న సేవలు తెలియజేశారు. రాష్ట్ర కార్యదర్శి గొట్టిముక్కల నాసరయ్య మాట్లాడుతూ శ్రీ శ్రీ ఆశయాలతో , వారి బాటలో నడుస్తూ మాలాంటి కవులను ప్రోత్సహిస్తున్నా చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ కు ధన్యవాదాలు తెలిపారు. జాతీయ అధ్యక్షురాలు జి. ఈశ్వరీభూషణం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సుధీర్, గాండ్ల హరి ప్రసాద్ ధర్మ చక్ర ఫౌండేషన్ అధ్యక్షుడు, జాషువా సాంస్కృతిక సాహిత్య సంస్థ ప్రధాన కార్యదర్శి రామరావు, శ్రీకాంత్, లక్ష్మీ నారాయణ, మట్లే మాధవరావు, జి. మాలకొండయ్య, కళాకారులు, కవులు కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవులకు, విప్లవ ఉద్యమకారులకు ఘనంగా సన్మానించారు.
What's Your Reaction?






