శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయం రూ 1,05,93,411

శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి హుండీ ఆదాయం రూ 1,05,93,411
వలేటివారిపాలెం జనసాక్షి : కదుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెం మండలం మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి 14 వారాల హుండీ లెక్కింపు శుక్రవారం ఆలయ కార్యనిర్వాహణాధికారి కేవి సాగర్ బాబు ఆధ్వర్యంలో ప్రధమ శ్రేణి కార్యనిర్వాణాధికారి వీవీఎల్ రవీంద్రనాథ్ పర్యవేక్షణలో లెక్కింపు జరిగింది. ఈ సందర్భంగా హుండీ లెక్కించగా ఆదాయం రూ 1,05,93,411 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సాగర్ బాబు తెలిపారు. అదేవిధంగా యూఎస్ 152 డాలర్లు, కెనడా డాలర్స్ 10, ఇంగ్లాండ్ పౌండ్స్ 60, బంగారం 345 గ్రాములు, వెండి రెండు కేజీల 20 గ్రాములు వచ్చాయని సాగర్ బాబు తెలియజేశారు . శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి భక్తులు హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
What's Your Reaction?






