విత్తన శుద్ధితో పంటల దిగుబడుల్లో వృద్ధి

Dec 20, 2024 - 17:16
 0  18
విత్తన శుద్ధితో  పంటల దిగుబడుల్లో వృద్ధి

టంగుటూరు జనసాక్షి  : శనగ పంట సాగులో విత్తనాన్ని విత్తుకునే ముందుగా బీజామృతంతో శనగ విత్తనాలను శుద్ధి చేయడం వల్ల భూమి లోపల వచ్చే తెగుళ్లను అరికట్టవచ్చు అని ఐసిఆర్ పి.శృతి పేర్కొన్నారు. మండలంలోని ఎం. నిడమానూరు గ్రామంలో మంగళవారం ఏపీసీఎన్ ఎఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ వి. సుభాషిణి ఆదేశాలు మేరకు రైతు పొలంలో విత్తుకునే ముందుగా విత్తనాలను బీజామృతంతో శుద్ధి చేశారు. అనంతరం శనగ పంట సాగులో అంతర పంటలుగా ఆవాలు, ధనియాలు, పొద్దు తిరుగుడు పంటలు వేశారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ ఐసిఆర్ పి శృతి మాట్లాడుతూ పంట వేసే ముందుగా బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల భూమి నుండి సంక్రమించే తెగుళ్లను పూర్తిగా అరికట్టవచ్చునని తద్వారా పంట ఎదుగుదలతో పాటు, అధిక దిగుబడిని సాధించవచ్చునని, అంతేకాకుండా అంతర పంటలు వేసుకోవడం పోషక పదార్ధాల వినియోగ సామర్ధ్యం పెంచవచ్చునని, కలుపు మొక్కలు రాకుండా నివారించడంతోపాటు పురుగు ఉధృతిని తగ్గించవచ్చునని, భూసారాన్ని పెంచవచ్చునన్నారు త్వదార అధిక ఆదాయం పొందవచ్చునన్నారు. రైతులకు తెలియజేశారు. గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి అవగాహన కల్పిస్తూ రైతుసోదరులందరూ కూడా అన్ని రకాల పంటలు వేసే ముందుగా బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చాడు. అంతేకాకుండా రసాయనాలు బదులు మనమే ప్రకృతి ద్వారా లభించే ఆకులతో ఆవు పేడ, మూత్రంతో, ఇతర పదార్థాలతో కషాయాలు తయారు చేసుకోవచ్చు అన్నారు. పంటలో వచ్చే తెగుళ్లుని బట్టి కషాయాలను తయారు చేసుకొని పంటలపై పిచికారి చేయటం వల్ల తక్కువ ఖర్చుతో పంట అధిక దిగుబడిని సాధించవచ్చునని రైతులకు సూచించారు. బీజామృతాన్ని మనం మన ఇంటి ఆవరణంలోనే తయారు చేసుకోవచ్చు ఇది విత్తనాలు వేసి 12 గంటల ముందు తయారు చేసుకుంటే సరిపోతుందని రైతులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పకృతి వ్యవసాయ సిబ్బంది ఐసిఆర్పీలు శృతి, రైతులు హాజరు కావడం జరిగింది.

-

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow