నూతన పార్లమెంట్ భవనంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా సాగింది.

నూతన పార్లమెంట్ భవనంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా సాగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ , ఇతర ఎంపీలతో కలసి పాల్గొన్నారు. ఇప్పటివరకు పాత పార్లమెంట్ భవనంలో టీడీపీ కార్యాలయం ఉండేది. ఇటీవల నూతన పార్లమెంట్ భవనం నిర్మించిన నేపథ్యంలో టీడీపీ కార్యాలయాన్ని నూతన పార్లమెంట్ భవనంలో ఏర్పాటు చేశారు. కార్యాలయం ప్రారంభం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
What's Your Reaction?






