అనివేటి మండపం నిర్మాణానికి రూ 90.516 విరాళం

అనివేటి మండపం నిర్మాణానికి రూ 90,516 విరాళం
కందుకూరు గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లి దేవాలయం పునః నిర్మాణంలో భాగంగా భక్తులు, దాతలు విరాళాలు అందించటం అభినందనీయం. ఇప్పటికే భక్తులు, దాతల సహకారంతో సుమారు 6 కోట్ల రూపాయలతో దేవాలయమును నిర్మించారు. అదే విధంగా దేవాలయం ముందు నూతనంగా అనివేటి మండపాన్ని దాదాపుగా రూ 4 కోట్లతో నిర్మించేందుకు సంకల్పించినారు. భక్తులు అంకమ్మ తల్లి పై నమ్మకంతో విరివిరిగా విరాళాలు అందిస్తున్నారు . శనివారం కందుకూరు వాస్తవ్యులు పోటికెలపూడి వెంకట సుబ్బు సుందర రామారావు ధర్మపత్ని మహాలక్ష్మీ కుమారుడు నరసింహ సాయి కౌశిక్ అనివేటి మండపం నిర్మాణమునకు 40,516 రూపాయలు మరియు కాళిదాసు శ్రీనివాసమూర్తి కుమారుడు ఆదిత్య దత్త చరణ్ 50,000 రూపాయలు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు గాండ్ల శ్రీనివాసులు,ఆవుల మాధవరావులకు అందజేశారు.
What's Your Reaction?






