వరద బాధితులకు 1 లక్ష ఆర్థిక సహాయం

వరద బాధితులకు రూ 1లక్ష ఆర్థిక సహాయం
ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు విజయవాడను ముంచెత్తడంతో జనజీవనం స్తంభించిన సంగతి తెలిసిందే. వరదల్లో చిక్కుకున్న ప్రజలకు సహాయార్థం కందుకూరు నియోజవర్గంలోని ప్రజా ప్రతినిధులు వరద సహాయార్థం రూ 1 లక్ష డిడిని కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ కు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరదల్లో చిక్కుకున్న ప్రజలకు సహాయం చేయాలనే ఆలోచనతో ఆర్థిక సహాయం అందించటం అభినందనీయమని తెలిపారు. ఆర్థిక సాయం అందజేసిన వారిలో వలేటివారిపాలెం జడ్పీటీసీ ఇంటూరి భారతి ( ఇంటూరి హరిబాబు) , కందుకూరు జడ్పీటీసీ తొట్టెంపూడి అనసూర్యమ్మ ( తొట్టెంపూడి శ్రీనివాసరావు), కందుకూరు ఎంపీపీ ఇంటూరి సుశీల ( ఇంటూరి మాధవరావు), విక్కిరాల పేట సర్పంచ్ గంగవరపు సునంద( గంగవరపు వెంకట్రావు), కొండి కందుకూరు సర్పంచ్ కుమ్మర బ్రహ్మయ్య, పాలూరు దొండపాడు మాజీ సర్పంచ్ గోసల వెంకా రెడ్డి, ఉలవపాడు కీర్తి చిరంజీవి, ఏకాంబరం విశ్వనాధం లు పాల్గొన్నారు.
What's Your Reaction?






