పాడేరు లో అరుదైన వింత పాము

పాడేరులోని చాకలిపేటలో ఓ ఉపాధ్యాయుడు కేశవరావు ఇంటి రెండో అంతస్తులోని వంటగదిలో నలుపు, ఎరుపు, గోల్డ్ రంగుల మిశ్రమంలో రింగ్ లుగా ఉన్న పాము కనిపించింది. దీనిని చూసి స్థానికులు భయాందోళన చెందారు. బండారు వాసు అనే వ్యక్తి చాకచక్యంగా పామును పట్టుకున్నారు. మూడున్నర అడుగులు ఉన్న ఈ పాము ఒరంటే ఫ్లయింగ్ స్నేక్ అని వాసు తెలిపారు. ఎగిరే స్వభావంగల ఈ పాము అడవుల్లో రాత్రిళ్లు ఎక్కువగా సంచరిస్తుందని స్థానికులు చెప్పారు.పాడేరు ఘాట్‌లోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
What's Your Reaction?






