వైసీపీలో చేరిన తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకుడు

.
వైసీపీలో చేరిన తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకుడు
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గుడ్లూరు మండలం పరకొండపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు చిరుతోటి ఏడుకొండలు వైసీపీ చేరారు. గుడ్లూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు పులి రమేష్ ఏడుకొండలకు వైసీపీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏడుకొండలు మాట్లాడుతూ గత ఐదేళ్లలో చెప్పిన మాట ప్రకారం సంక్షేమం అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం పాటిస్తున్నారు. కందుకూరు నియోజకవర్గంలో బుర్రా మధుసూదన్ యాదవ్ నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీలో చేరుతున్నానని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోల కొండయ్య,మాజీ సర్పంచ్ అల్లం బసవయ్య ,చెరుకూరి బ్రహ్మయ్య ,గ్రామస్తులు,నాయకులు ,కార్యకర్తలు, వైసీపీ అభిమానులు పాల్గొన్నారు.
What's Your Reaction?






