రామాయపట్నం పోర్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి

కందుకూరు జనసాక్షి : రామాయపట్నం పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, పోర్టు పనుల ప్రగతి చాలా బాగుందని రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్ అన్నారు.గురువారం ఆయన రామాయపట్నం పోర్ట్ ప్రగతిని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ తో కలసి సమీక్ష చేశారు.అనంతరం పోర్టులో జరుగుతున్న మొదటి బెర్త్ నిర్మాణ పనులకు కలెక్టర్ , పోర్టు ఎండి ప్రతాప రెడ్డితో కలసి పరిశీలించారు.ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజు మాట్లాడుతూ మొదటి ఓడ పోర్ట్ లోనికి రావడానికి వీలుగా డ్రెడ్జింగ్ , బెర్త్ నిర్మాణంతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని సూచించారు. పోర్ట్ పరిసర ప్రాంతాల భౌగోళిక స్థితి పై ఆరాతీశారు.మాస్టర్ ప్లాన్ ,మాప్ లను పరిశీలించారు .మాస్టర్ ప్లాన్ ప్రకారం అన్ని అనుమతులు ఉన్నాయో లేదో పరిశీలించు కోవాలన్నారు. పోర్టుకు అవసరమైన మౌలిక సదుపాయాలైన రహదారులు,రైల్వే లైన్లు, ప్రహరీ గోడ ఓవర్ హెడ్ ట్యాంక్, కస్టమ్స్ బిల్డింగులు, బెర్తులు, నార్త్ సౌత్ బ్రేక్ వాటర్ పనులు,dredging పనులు ,స్టాక్ యార్డ్ మెరక పనులు కూలంకషంగా సమీక్ష చేశారు.ఆప్రాంత ప్రజల పునరావాసం ,పోర్ట్ బుసేకరణ ను రెవెన్యూ అధికారులు సెక్రటరీ కి వివరించారు. ఈ
కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సోభిక, RPDCL అధికారులు పోర్ట్ ఎండీ ప్రతాప్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, పద్మావతి పోర్టు అధికారులు సుధాకర రావు,శేషుబాబు, జెడి ఇండస్ట్రీస్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?






