నూకతోటి ప్రసాదు ధన్యజీవి

Sep 28, 2023 - 18:07
 0  172
నూకతోటి ప్రసాదు ధన్యజీవి


 కందుకూరు జనసాక్షి  : నూక తోటి ప్రసాదు ధన్యజీవి అని కందుకూరు డిప్యూటీ ఎడ్యుకేషనల్  అధికారి  ఏ. శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇటీవల మృతి చెందిన కందుకూరు మండల విద్యాశాఖ అధికారి నూకతోటి ప్రసాదు సంస్మరణ సభను గురువారం   కందుకూరు బాలికలు ఉన్నత పాఠశాలలో బహుజన టీచర్స్ అసోసియేషన్( బి టి ఏ) రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో  నిర్వహించారు. ఈ సంస్మరణ సభకు ముఖ్యఅతిథిగా   హాజరైన కందుకూరు డిప్యూటీ ఎడ్యుకేషన్ అధికారి  శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రసాద్  మంచి ఉపాధ్యాయుడు, మంచి అడ్మినిస్ట్రేటర్ అని, తాను చేయదలుచుకున్న పనిని నిర్భయంగా, నిజాయితీగా  చేసి  అధికారులు ఇటు ఉపాధ్యాయుల మనసులలో చోటు సంపాదించుకున్న  అమరజీవని పేర్కొన్నారు . కందుకూరు మండల విద్యాశాఖ అధికారి  సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రసాద్  అనారోగ్యముగా ఉన్నప్పటికీ  ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా, సిబ్బందిని ఇబ్బంది పెట్టకుండా  విధులు నిర్వహించిన గొప్ప అధికారిని కొనయాడారు. కావలి మండల విద్యాశాఖ అధికారి బండి గోవిందయ్య  మాట్లాడుతూ విధి నిర్వహణలో  రాజీ పడని గొప్ప అధికారి ప్రసాద్ అని తెలిపారు. బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లం వేణుగోపాల్  మాట్లాడుతూ ప్రసాద్  విద్యార్థి ఉద్యమం నుంచే విద్యార్థి నాయకుడిగా, ఆ తరువాత ఉపాధ్యాయ వృత్తిలో చేరిన తర్వాత బహుజన ఉపాధ్యాయ సంఘాన్ని ప్రారంభించి రాష్ట్ర నాయకుడిగా పని చేశారని, స్నేహశీలి, నిరంతర పరిశోధకుడు, సామాజిక విషయాల పట్ల సమరశీలమైనటువంటి రచనలు వ్యాఖ్యానాలు  చేసే గొప్ప రచయిత అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లగుంట మోహనరావు అధ్యక్షతన జరిగిన ఈ సంస్మరణ  సభలో బి టి ఏ రాష్ట్ర నాయకులు  ఆదినారాయణ, లక్ష్మయ్య,             చిన్న వెంగయ్య,  ఊట్లరఘు, మేడికొండ భాస్కర్, దార్ల కోటేశ్వరరావు, కట్టా రమేష్ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టేట్టు రమేష్, ప్రసాదన్న కుటుంబ సభ్యులు పాల్గొనగా, రాష్ట్ర నాయకులు సంఘ మహేంద్ర వందన  సమర్పణతో సభ ముగిసింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow