100 కేజీల గంజాయి పట్టివేత

Feb 19, 2025 - 08:47
Feb 19, 2025 - 08:50
 0  39
100 కేజీల గంజాయి పట్టివేత

100 కేజీల గంజాయి పట్టివేత

-- గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు -- డీఎస్పీ బాలసుబ్రమణ్యం 

--- కందుకూరు పోలీసులను అభినందించిన ఎస్పీ కృష్ణ కాంత్ 

 గంజాయి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కందుకూరు డీఎస్పీ సిహెచ్ వి బాలసుబ్రమణ్యం హెచ్చరించారు. సోమవారం కందుకూరు డీఎస్పీ కార్యాలయంలో గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన ముద్దాయిలతో పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పి బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ ఒరిస్సా నుంచి తమిళనాడుకు గంజాయి రవాణా జరుగుతుందని తమకు అందిన సమాచారం ప్రకారం కందుకూరు సీఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఉలవపాడు ఎస్సై అంకమ్మ వారి సిబ్బంది వాహనాలు తనిఖీ నిర్వహించారు. ఉలవపాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద మహేంద్ర కారులో గంజాయి అక్రమ రవాణాను గుర్తించడం జరిగిందని,. కారులో నుంచి ఇద్దరు నిందితులో పరారీ  కాగా . మరో ఇద్దరు నిందితులు పట్టుపడ్డారని డీఎస్పీ మీడియా ముందు హాజరు పరిచారు. ఇద్దరు నిందితుల్లో ఒకరు ఇల్లపు నాగేశ్వరరావు, తాడి సత్యనారాయణ వీరు పాత ముద్దాయిలు, వీరిపై గతంలో అనేక కేసులు నమోదయి ఉన్నాయని తెలిపారు. కారు డోరులో , స్పీకర్ల బాక్స్ లో 95 గంజాయి ప్యాకెట్లు పెట్టారని, అవి మొత్తం 100 కిలోలు ఉన్నాయని తెలిపారు. కారును రెండు సెల్ఫోన్లను సీజ్ చేశామని తెలిపారు. నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ఆదేశాలతో వీరిని పట్టుకున్నామని తెలిపారు. గంజాయి రవాణా చేస్తున్న వారిని పట్టుకున్న  కందుకూరు సీఐ కి, ఉలవపాడు ఎస్సైై కి  ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేస్తారని తెలిపారు. ముద్దాయిలను విచారించి పారిపోయిన ఇద్దరినీ పట్టుకుంటామని డీఎస్పి  తెలిపారు. గంజాయి తో పట్టుపడితే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow