రాప్తాడు సిద్ధం సభా ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Feb 17, 2024 - 13:47
 0  187
రాప్తాడు సిద్ధం సభా ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

స్థలం : రాప్తాడు, అనంతపురం జిల్లా

 జనసాక్షి : రాప్తాడు సిద్దం సభా ప్రాంగణాన్ని  రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా   సిద్ధం సభా ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు.సిద్ధం అనంతపురం సభను ఎన్నికల సభగా నిర్వహిస్తున్నాం.వైసిపి శ్రేణులకు ఈ సభ మంచి సందేశాన్ని ఇస్తుంది.సభ అనంతరం వైసిపి ఎన్నికల ఊపు అందుకుంటుంది.అందుకే ప్రతిష్టాత్మంగా తీసుకుని సభ విజయవంతానికి కృషి చేస్తున్నాం.రాబోయే ఎన్నికలకు పూర్తిగా వైసిపి శ్రేణులు సన్నద్ధం అవుతాయి.రాష్ట్ర ప్రజలందరూ వైసీపీ పట్ల ఆకర్షితులు అవుతారు.ఈ సభతో రాష్ట్రంలో మూడు సిద్దం సభలు పూర్తి అవుతాయి.త్వరలో పల్నాడులో మరో సభ నిర్వహణ ఉంటుంది.గత ఎన్నికల కంటే అత్యధిక స్థానాలు సాధించేందుకు ఈ సభ ఊతం ఇస్తుంది. రాష్ట్రంలో అతి పెద్ద సభగా ఈ సిద్దం సభ నిలుస్తుంది.రాష్ట్ర ప్రజలందరికీ సిఎం జగన్ సందేశం అందుతుంది.ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల నుండి వైసిపి శ్రేణులు ఈ సభలో పాల్గొంటున్నారు.2024 ఎన్నికల్లో 151 కంటే ఎక్కవ స్థానాలు గెలుస్తాం.దెందులూరు సభ చూస్తే కోస్తా ప్రాంతంలో వైసిపి బలం తెలుస్తుంది.ప్రభుత్వ పనితీరే పార్టీ విజయానికి దోహదపడుతుంది.అమ్మఒడి, నాడు నేడు, ఆరోగ్య శ్రీ లాంటి గొప్ప పథకాలు అమలు చేస్తున్నాం.ఎన్నికల్లో చెప్పుకునేందుకు అనేక పథకాలు సిఎం జగన్ మాకు అందించారు.టిడిపి వారు మేము ఇది చేశాము అని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా ?ఏమి లేదు కాబట్టే తిట్టడమే లక్ష్యంగా పెట్టుకుని చంద్రబాబు ప్రసంగాలు చేస్తున్నారు.

ఈ నెల 26 న సిఎం జగన్ కుప్పం ప్రజలకు హంద్రీనీవా ద్వారా నీరు అందిస్తారు.14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు ఆ పని చేయలేక పోయారు.కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతా ఎప్పుడో వైసిపి లోకి మారిపోయాయి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow