12వ తరగతి విద్యార్థి మేధో సృష్టి
12వ తరగతి విద్యార్థి మేథో సృష్టి..మనిషి ప్రయాణించ
ప్రతిభ ఎవరి సొంతం కాదనే సత్యాన్ని నిజం చేశాడు ఓ పన్నెండవ తరగతి విద్యార్థి,ప్రతిభకు వయసుతో సంబంధం లేదంటారు.. మనిషిలో క్రియేటివిటీ ఉండాలేగాని నూతన ఆవిష్కరణలతో సరికొత్త రికార్డులు దాసోహమనక తప్పదు. ఆర్యభట్టు.. ఐన్ స్టీన్, ఆర్కిమెడిస్ నుంచి నేటి వరకు శోధించే తత్వమే మనిషిని నూతన పరిజ్ఞానం సృష్టికి ప్రేరేపిస్తుంది.
ఇందుకు నిదర్శనంగా మధ్యప్రదేశ్ గ్వాలియర్ కు చెందిన 12వ తరగతి విద్యార్థి మేధాన్ష్ త్రివేది ఐదేళ్లపాటు శ్రమించి తొలుత ఓ బుల్లి డ్రోన్ ను తయారు చేశాడు. అంతటి తో సంతృప్తి చెందని అత డు మరిన్ని పరిశోధనలు సాగించి మనిషి ప్రయాణిం చే డ్రోన్ ట్యాక్స్ ని తయారీ చేశాడు.
దీనికి ఎంఎల్డీటీ01( MLDT 01)అని పేరు పెట్టాడు
ఇది 60కిలోమీటర్ల వేగంతో 80కిలోల బరువు గల వ్యక్తిని ఆరు నిమిషాల పాటు గాల్లో మోయగల గదు. 3 నెలల పాటు శ్రమించి రూ.3.5లక్షల వ్యయంతో ఈ డ్రోన్‌ను సృష్టించారు. తను తయారు చేసిన డ్రోన్ లో తనే ప్రయాణించి తన ప్రయోగ విజయాన్ని అందరికి చాటాడు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మేధాన్ష్ త్రివేది తన పేరుకు తగ్గట్లుగానే తన అద్భుత మేధస్సుతో సృజనాత్మక ఆలోచనలతో మనిషి ప్రయాణించే డ్రోన్ ను రూపొందించడం ద్వారా సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నాడు.
మేధాన్ష్ త్రివేది నేటి తరం విద్యార్థులకు స్ఫూర్తిదా యకంగా నిలిచాడని అంతా అభినందిస్తున్నారు.
What's Your Reaction?






