యువగళానికి రెండేళ్లు - అభివృద్ధి దిశగా అడుగులు

Jan 27, 2025 - 20:13
Jan 27, 2025 - 20:14
 0  124
యువగళానికి  రెండేళ్లు - అభివృద్ధి దిశగా అడుగులు

యువగళానికి రెండేళ్లు - అభివృద్ధి దిశగా అడుగులు

-వేమిరెడ్డి దంపతులు 

ఈ తరం యువతకు యవనేత, మంత్రి నారా లోకేష్ ఆదర్శమన్నారు వేమిరెడ్డి దంపతులు. యువగళం పాదయాత్ర తలపెట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి శుభాకాంక్షలు తెలిపారు. గూగుల్, టి ఎస్ సి మిట్టల్ అండ్ నిప్పాన్ స్టీల్ లాంటి దిగ్గజ పారిశ్రామిక సంస్థలు మన రాష్టంలో 6. 33 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేలా ఒప్పించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారని ప్రశంసించారు. ఇటు కుప్పం నుంచి అటు విశాఖపట్నం వరకు సాగిన సుదీర్ఘ పాదయాత్ర ద్వారా లోకేష్  పరిణితి చెందిన నాయకులుగా రాటు తేలారని కొనియాడారు. రాష్టంలోని 97 నియోజకవర్గాలను కవర్ చేస్తూ లోకేష్  పాదయాత్ర సాగితే అందులో 90 శాసనసభ స్థానాలు అభ్యర్థులు గెలిచి కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చేందుకు దోహద పడిందన్నారు. ఓ వైపు మండుటెండలు మరో వైపు జోరు వర్షాలు లాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని అనుకున్న లక్ష్యాన్ని సాధించిన కార్యసాధకుడని నారా లోకేష్ ని ప్రశంసించారు. అడుగడుగునా ఆంక్షలు, అరెస్టులు లాంటి నిర్బంధాలను సైతం ఎదుర్కొని 226 రోజులలో 3 వేల 132 కిలోమీటర్లు కాలి నడకన 2 వేల 97 గ్రామాల ప్రజల సాధక బాధలు వింటూ సాగిన యువగళం పాదయాత్రను ఆంధ్రప్రదేశ్ రాష్ట రాజకీయ ప్రక్షాళన యాత్ర గా అభివర్ణించారు వేమిరెడ్డి దంపతులు. ప్రస్తుతం విద్యా, ఐటి శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి కోసం లోకేష్ చేస్తున్న కృషి ఆయన పాలనా దక్షతకు అద్దం పడుతున్నాయని వేమిరెడ్డి దంపతులు యువగళం యాత్ర రెండేళ్లు పూర్తయిన సందర్భంగా అభినందించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow