దావోస్ పెట్టుబడులతో స్వర్ణాంధ్ర సహకారం- వేమిరెడ్డి దంపతులు

Jan 27, 2025 - 22:06
 0  77
దావోస్ పెట్టుబడులతో  స్వర్ణాంధ్ర సహకారం- వేమిరెడ్డి దంపతులు

దావోస్‌ పెట్టుబడులతో స్వర్ణాంధ్ర సాకారం - వేమిరెడ్డి దంపతులు

వరల్డ్ ఎకనామిక్ ఫోరం-2025 సదస్సు ద్వారా రాష్ట్రానికి అధికంగా పెట్టుబడులు తీసుకువచ్చిన విజనరీ లీడర్‌, ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు . రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి   ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్‌  వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి  అన్నారు. దావోస్ పర్యటన సందర్భంగా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై వారు హర్షం వ్యక్తం చేశారు. దావోస్‌ పర్యటన సూపర్ సక్సెస్ అయ్యిందని కొనియాడారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. గత పాలకుల వల్ల అదః పాతాలానికి పడిపోయిన పారిశ్రామిక రంగం.. నేడు కొత్త పుంతలు తొక్కూతూ.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సిద్ధమవుతోందన్నారు. దావోస్‌ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు యువ నాయకులు రాష్ట్రమంత్రి నారా  లోకేష్  ఎముకలు కొరికే చలిలో తిరుగుతూ.. ఎంతో శ్రమించి పలు కంపెనీలు మన రాష్ట్రానికి తీసుకువచ్చారన్నారు.

సీఎం చంద్రబాబు   సారధ్యంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి 5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని, సుమారు 50 కంపెనీలు రాష్ట్రంలో తమ కార్యకలాపాలు ప్రారంభించడం సాధారణ విషయం కాదన్నారు. వీటితో దాదాపు 40,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయన్నారు. ఒక్క జూమ్ కాల్ తోనే మిట్టల్ స్టీల్ కంపెనీ తో మాట్లాడి రాష్ట్రానికి 1.46 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకువచ్చిన ఘనత రాష్ట్ర విద్యా మరియు మానవుని శాఖ మంత్రి నారా లోకేష్‌ గారిదన్నారు. జనవరి 8న విశాఖపట్నంలో 2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేయడంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కృషి పట్టుదల ఎంతో ఉందన్నారు. 

ప్రముఖ సంస్థలైన టిసిఎస్ బీపీసీఎల్, రిలయన్స్, గ్రీన్ కో, ఆర్సెలార్‌ మిట్టల్‌, నిప్పాన్ స్టీల్, పీపుల్ టెక్ వంటి అనేక పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టబోతున్నాయని, నారా చంద్రబాబు నాయుడు  సారథ్యంలో త్వరలో మన రాష్ట్రం అన్ని రంగాలలో పూర్తిస్థాయిలో అభివృద్ధి సాధించబోతోందని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న అపార వనరులు మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ పాలసీలపై పారిశ్రామికవేత్తలను మెప్పించారని చెప్పారు. భేటీ అయిన ప్రతి పారిశ్రామికవేత్త తమ ఎగ్జిక్యూటివ్ నెంబర్లతో చర్చించి రాష్ట్రానికి తప్పకుండా వచ్చి పెట్టుబడులు పెడతామని సానుకూలంగా స్పందించారని వివరించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow